పేదలు ఆత్మగౌరవంతో బతకేందుకే డబుల్ ఇండ్లు
* భూగర్భ, గనుల సమాచార శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి
* శంకర్ పల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ
* హాజరైన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
రచ్చబండ, శంకర్ పల్లి : చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మున్సిపాలిటీలో 130 కోట్లా 79 లక్షలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను భూగర్భ, గనుల సమాచార శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య సోమవారం ప్రారంభించారు. 50 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసి వాటికి సంబంధించిన పట్టాలు అందించారు. అనంతరం లబ్దిదారులతో కలసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇళ్లు లేని పేదలకు ఆశ్రయం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఉచిత డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కార్యక్రమం తెలంగాణ వచ్చిన తర్వాత పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని, అందుకే భారీ వ్యయంతో కూడుకున్నప్పటికీ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
పేద ప్రజలు ఆత్మ గౌరవంతో బ్రతకాలన్న ఉద్దేశ్యంతోనే ఆర్థికంగా భారమైనప్పటీకి సిటీ కాలనీ లోని సంపన్నుల గేటెడ్ కమ్యూనిటీ మాదిరి ఇండ్ల నిర్మాణం చేపట్టాము. డబుల్ బెడ్ రూం ఇండ్ల గృహ సముదాయంలో సకల సౌకర్యాలను ఏర్పాటు చేశాము. పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా ఇండ్ల కేటాయింపు జరిగింది అనిన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, శంకర్ పల్లి మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి, శంకర్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, ఏ ఎంసీ చైర్మన్ పాపారావు, మండల, మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్ కన్నా, నాయకులు ప్రవీణ్ కుమార్, గోపాల్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్ లు, తదితరులు పాల్గొన్నారు.