పెన్షన్ భిక్ష కాదు.. రాజ్యాంగం కల్పించిన హక్కు

పెన్షన్ భిక్ష కాదు.. రాజ్యాంగం కల్పించిన హక్కు
* రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండీ తాహేర్ అలీ
ఉద్యోగి పదవి విరమణ అనంతరం పొందే పెన్షన్ భిక్ష కాదని,అది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తాహెర్ ఆలి అన్నారు. మంగళవారం శంకర్పల్లిలోని ఎంపీడీవో ఆఫీస్లో జరిగిన నేషనల్ డివార్మింగ్ డే శిక్షణ కార్యక్రమానికి హాజరైన వైద్య సిబ్బంది, ప్రధానోపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రేవతి రెడ్డి, మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్ సమక్షంలో పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మర్పల్లి అశోక్ మాట్లాడుతూ ఈనెల 16వ తారీఖున అలంపూర్ నుండి ప్రారంభమైన పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్రకు వేల సంఖ్యలో పాల్గొన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు వర్షాన్ని సహితం లెక్కచేయకుండా యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని, ఇదే తరహాలో రంగారెడ్డి జిల్లా లోని ఉద్యోగ ఉపాధ్యాయులు తమ చిరకాల కోరికైనటువంటి సి పి ఎస్ విధానాన్ని రద్దుచేసి, ఓ పి ఎస్ విధానాన్ని పునరుద్ధరించడానికి జూలై 30న షాద్నగర్ నుండి రాజేంద్రనగర్ వరకు కొనసాగే రథయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు నరహరి, జయసింహ రెడ్డి, సుధాకర్, టిఎస్యుటిఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉదయశ్రీ, కృష్ణ, యూ పి ఎస్ బల్క పూర్ ప్రధాన ఉపాధ్యాయులు వనజ,యూ పి ఎస్ మొకీల ప్రధాన ఉపాధ్యాయులు పద్మజ, గోపులారం ప్రధాన ఉపాధ్యాయులు ఆశీర్వాదం, పర్వేదా ప్రధాన ఉపాధ్యాయురాలు రాజేశ్వరి, ప్రణీత, మునవ్వరు సుల్తాన్, రమేష్, సులోచన, రాఘవేందర్, అరిఫ్, సి ఆర్ పి ప్రభాకర్ రెడ్డి, రాజశేఖర్, దస్తప్ప మొదలగు వారు ఉన్నారు.