పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్రను విజయవంతం చేద్దాం

పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్రను విజయవంతం చేద్దాం
* టిఎస్సిపిఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు తాహేర్ అలీ
* శంకర్ పల్లి నుండి సంకల్ప రథయాత్రకు బయలుదేరిన నేతలు
రచ్చబండ, శంకర్ పల్లి : తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ తలపెట్టిన పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర జోగులాంబ గద్వాల్ జిల్లాలో జూలై16న ప్రారంభమై,జూలై 31 వరకు తెలంగాణలోని 33 జిల్లాల మీదుగా కొనసాగుతుందని, కాబట్టి ఈ యాత్రలో ప్రతి సిపిఎస్ ఉద్యోగ,ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయగలరనీ జిల్లా అధ్యక్షుడు ఎండీ తాహేర్ అలీ పిలుపునిచ్చారు.

జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఉపాధ్యక్షులు దర్శన్ గౌడ్, అసోసియేట్ అధ్యక్షుడు మర్పళ్లిఅశోక్, కార్యదర్శులు జంగయ్య,రాముశర్మ సంకల్ప రథ యాత్రకు బయలు దేరడం జరిగింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో జూలై 30న షాద్ నగర్ నుండి రథయాత్ర ప్రారంభమై,రాజేంద్రనగర్ లోని ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గుండా కొనసాగి,యాదాద్రి జిల్లాలో ముగుస్తుందని తెలియజేయడం జరిగింది.

జిల్లా అసోసియేట్ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ సీపిఎస్ రక్కసిని పారాదోలాడానికి మనమందరం శక్తి వంచన లేకుండా పని చెయ్యాలని,తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి ఏ విధంగా అయితే సకలజనుల సమ్మె చేశామో దానికి భిన్నంగా శాంతి యూతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రలో సీపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు జిపిఎఫ్ ఉద్యోగ, ఉపాధ్యాయులు మరియు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని కోరడం జరిగింది.