పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి
* శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్
రచ్చబండ, శంకర్ పల్లి: పరిసరాల పరిశుభ్రతకై ప్రతి ఒక్కరు పాటుపడాలని శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఏక్ తారీఖ్ ఏక్ గంట ఏక్ సార్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో శ్రమదానం చేసి చెత్తాచెదారాన్ని తొలగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అందుకోసం ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే ఈగలు దోమల బెడద అధికంగా ఉంటుందని దీంతో ప్రజలు అనారోగ్యానికి గురువు గురవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, కమిషనర్ జ్ఞానేశ్వర్, కౌన్సిలర్లు జూలకంటి శ్వేతా పాండురంగారెడ్డి, బిసోల సంధ్యారాణి అశోక్ కుమార్, కో ఆప్షన్ సభ్యులు మహమూద్, మున్సిపల్ మేనేజర్, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, మహిళలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలోని ప్రధాన చౌరస్తాలు విద్యార్థులు మానవహారంగా ఏర్పడి స్వచ్ఛతపై ప్రమాణాలు చేశారు.