పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి

పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి

* మిర్జాగూడ సర్పంచ్ రవీందర్ గౌడ్ పిలుపు

రచ్చబండ, శంకర్ పల్లి: ప్రజలు పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని శంకర్ పల్లి మండలం మిర్జాగూడ గ్రామ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్ పిలుపునిచ్చారు.

గురువారం మిర్జాగూడ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్ కాలనీలోని ఫేస్-1లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థినులకు ముగ్గుల పోటీలు, డాన్స్ పోటీలు, భోగి మంటలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శాంతి కిషన్ సింగ్, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్, వార్డు సభ్యులు రాజు గౌడ్, ప్రవీణ్, మిర్జాగూడ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు ఒగ్గు ఆంజనేయులు, నాయకులు నరసింహ గౌడ్ తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులను అందించారు.