నేడు జిల్లాలోకి పాత పెన్షన్ సాధన సంకల్పయాత్ర

* టీఎస్సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షులు తాహెర్ అలీ

రచ్చబండ, శంకర్ పల్లి : పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం చేపట్టిన పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర నేడు జూలై 30 జిల్లాలోకి ప్రవేశించనుందని, ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ హాజరై విజయవంతం చేయాలని టీఎస్సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షులు తాహెర్ అలి జిల్లా కేంద్రంలో శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 11:30 గంటలకు షాద్ నగర్ సాయిబాబా టెంపుల్ నుండి MPDO వరకు నడకర్యాలీ, సమావేశం ఉంటుందని తెలిపారు.

 

అనంతరం రథ యాత్ర రాజేంద్ర నగర్ లోకి ప్రవేశిస్తుందని పేర్కొ న్నారు. కావున 3.30 గంటలకు అగ్రికల్చర్ యూనివర్సిటీ హైవే మెయిన్ గేట్ నుండి డైరీ ఫామ్ వరకు బైక్ ర్యాలీ ఉంటుందని, తర్వాత అక్కడే సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.అన్ని ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొనడం జరుగుతుంది.

 

రాష్ట్ర ఉపాధ్యక్షులు దర్శన్ గౌడ్ మాట్లాడుతూ

‘అభి నహితో.. కబీ నహీ’ అనే నినాదంతో పాత పెన్షన్ సాధనకు గట్టిగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.ఆగస్ట్ 12 న హైద్రాబాద్ లో జరిగే పాత పెన్షన్ సాధన కార్యక్రమానికి అందరూ ఉద్యోగ , ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్,జిల్లా నాయకులు జైపాల్ రెడ్డి, మహేష్, షాద్ నగర్ మండల అద్యక్షులు జగన్ , శ్రీశైలం, మహిళ అధ్యక్షురాలు వీరమని, మాధవి,