డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో నిరుపేదలను ఆదుకుంటున్న ప్రభుత్వం
* శంకర్ పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి
రచ్చబండ: శంకర్ పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూములు అందిస్తూ వారికి సహకరిస్తున్నదని శంకర్ పల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం శంకర్ పల్లి మండలంలోని మిర్జాగూడ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్ లో 20 మంది పేదలకు డబుల్ బెడ్ రూమ్ పత్రాలను ఎంపీపీ అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనుకున్న ప్రకారం ఇల్లులేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ లను అందిస్తున్నారని తెలిపారు. గ్రామాలలో ఇల్లు లేని వారికి ప్రభుత్వం త్వరలో ఇండ్లను కేటాయిస్తుందని తెలిపారు. ఇంటి స్థలం ఉన్నవారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుపొంది మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చేకూరత గోవిందమ్మ గోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు, మిర్జాగూడ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్, జనవాడ సర్పంచ్ గౌడిచర్ల లలిత నరసింహ, ఎంపీటీసీ నాగేందర్, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్, ఉప సర్పంచ్ శాంతి కిషన్ సింగ్, వార్డు సభ్యులు రాజు గౌడ్, ప్రవీణ్, శారద, నాయకులు నరసింహ గౌడ్, మిర్జాగూడ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఒగ్గు అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.