జన్వాడ సర్పంచ్ లలితా నరసింహ వితరణ

జన్వాడ సర్పంచ్ లలితా నరసింహ వితరణ
* 3.50 లక్షల సొంత నిధులతో గ్రామంలో పడవు బావిపై కప్పు
* అభినందనలతో ముంచెత్తిన గ్రామస్థులు

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలం జనవాడ గ్రామంలో గ్రామ పంచాయతీకి చెందిన బావిపై గ్రామ సర్పంచ్ గౌడిచర్ల లలిత నరసింహ తన సొంత నిధులు మూడున్నర లక్షల రూపాయలతో కప్పును వేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి చెందిన బావిలో గ్రామస్తులు కొందరు వ్యర్థ పదార్థాలను బావిలో పారబోస్తున్నారని తెలిపారు. అందుకోసం బావిపై ఇనుపకంచెను వేయిస్తున్నామని చెప్పారు. గ్రామంలో అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 80% పనులు గ్రామంలో పూర్తి అయ్యాయని చెప్పారు. సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ మురికి కాలువలను పూర్తి చేశామని చెప్పారు. మరికొన్ని పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన పనులు దశలవారీగా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు గౌ డి చర్ల నరసింహ పాల్గొన్నారు.