గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూతనివ్వాలి

గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూతనివ్వాలి
* శంకర్ పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్

రచ్చబండ, శంకర్ పల్లి; గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు చేయూతనివ్వాలని శంకర్ పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్. నరేష్ కుమార్ అన్నారు. శనివారం మండలంలోని అంతప్ప గూడ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అంగన్వాడి పిల్లలకు దాత ప్రొఫెసర్ నాగేంద్ర అందించిన నోటుబుక్కులు, పలకలు, పెన్సిల్లు, స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఎంతో ప్రతిభ దాగి ఉంటుందని తెలిపారు.

కార్పొరేట్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు దీటుగా వారు కూడా పరీక్షల్లో సత్తా చాటి ప్రథమ స్థానాలలో ఉత్తీర్ణులవుతున్నారని చెప్పారు. దాత నాగేంద్ర మాట్లాడుతూ నరేష్ కుమార్ పుట్టినరోజు అయిన జూలై 11న ఇవ్వాల్సిన ఈ మెటీరియల్ శనివారం విద్యార్థులకు అందించామని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు చేవెళ్ల జయరాం రెడ్డి, సభ్యులు నరసింహ గౌడ్, రవి, నాగేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేజియా, ఉపాధ్యాయులు వాణి, సామాజిక కార్యకర్త వడ్డే సత్యనారాయణ, బి టెల్ విద్యార్థులు, నవీన్, పాల్గొన్నారు.