గొల్ల కురుమల అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్

గొల్ల కురుమల అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్
* చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

రచ్చబండ, శంకర్ పల్లి : రాష్ట్రంలోని గొల్ల కురుమల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంతో కృషి చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కొనియాడారు. శనివారం శంకర్ పల్లి మండలంలోని పొద్దుటూరు గ్రామంలో గొల్ల కురుమలకు ఆరు యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నివర్గాలకు సమాన న్యాయం జరగడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.

పేద బడుగు వర్గాలను ఆదుకుంటూ వారి జీవితాల్లో వెలుగులను నింపుతున్నారని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రాలలో లేని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మన రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డల వలె ఆదుకుంటున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని గగోలు పెట్టిన మూడవసారి రాష్ట్రంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు. పొద్దుటూరు సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి, ఎంపీటీసీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి, మహారాజ్ పేట్ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి ,మాజీ సర్పంచ్ శ్రీనివాస్, జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు బొల్లారం వెంకటరెడ్డి, నాయకులు జి. గోవర్ధన్ రెడ్డి, ఎస్. ప్రవీణ్ కుమార్, చేకూర్త గోపాల్ రెడ్డి, జంగారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.