కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం
* చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్
* శంకర్ పల్లి పట్టణంలో ఇంటింటి ప్రచారం
రచ్చబండ, శంకర్ పల్లి: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షాబాద్ భీమ్ భరత్ గురువారం శంకర్ పల్లి పట్టణంలో ఇంటికి ఇంటి తిరిగి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ఆరు పథకాలను కచ్చితంగా అమలు చేస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ కల్లబల్లి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య కుటుంబ పాలన చేవెళ్ల నియోజకవర్గంలో జరుగుతున్నదని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు గ్రామాలలో జరిగాయని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో మొట్టమొదటిసారిగా పాఠశాల భవనాలు, నీటి ట్యాంకులు నిర్మించారని తెలిపారు.
ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఓటర్లు చేతి గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అంతకుముందు పట్టణంలో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి ఉదయ మోహన్ రెడ్డి, మండల, మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, వై. ప్రకాష్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాజు గౌడ్, మైనార్టీ నాయకులు ఎజాజ్, శంకర్ పల్లి సొసైటీ డైరెక్టర్ కె. రాజశేఖర్ రెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ జంగయ్య( శ్రీకాంత్) పలు గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.