ఐకమత్యంగా శంకర్ పల్లి పట్టణంలో శాంతిభద్రతలు కాపాడాలి
* శంకర్ పల్లి డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ నాగరాజు
రచ్చబండ, శంకర్ పల్లి; అందరూ కలిసిమెలిసి ఉంటే శంకర్ పల్లి పట్టణంలో ఎలాంటి నేరాలు జరగకుండా శాంతిభద్రతలను కాపాడవచ్చు అని శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ నాగరాజు అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో బుధవారం భాగంగా శంకర్ పల్లి పట్టణం గణేష్ నగర్ లో ఉన్న నక్షత్ర యూత్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న వివిధ నేరాలు-ఘోరాలపై యువకులు అవగాహన కలిగి ఉండాలని వివరించారు. అలాగే సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు గురించి వివరించడం జరిగింది. అందరూ కలిసి మెలిసి ఉంటూ శంకర్ పల్లి పట్టణంలో శాంతి భద్రతలు కాపాడాలని పిలుపునిచ్చారు. యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని అన్నారు.
అందరూ కలిసిమెలిసి ఉంటే శంకర్ పల్లి పట్టడాని ఆదర్శ పట్టణంగా మార్చవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ నక్షత్ర అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.