ఐఎల్ఎమ్ తో తార్కిక గణిత పరిజ్ఞానాభివృద్ధి

ఐఎల్ఎమ్ తో తార్కిక గణిత పరిజ్ఞానాభివృద్ధి
* కొండకల్ తండా ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్

రచ్చబండ, శంకర్ పల్లి: జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా శుక్రవారం శంకర్ పల్లి మండలం కొండకల్ తాండ ప్రాథమిక పాఠశాలలో గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా గణిత అంశాలను ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా విద్యార్థులకు గణిత అంశాలపై అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, ఉపాధ్యాయులు మర్పల్లి అశోక్ మాట్లాడుతూ ఐఎల్ఎమ్ తో విద్యార్థులు గణితాన్ని సులభంగా నేర్చుకోవడంతోపాటు వారిలో తార్కిక గణిత పరిజ్ఞానాభివృద్ధి చెందుతుందని తెలిపారు.

జీవన గమనంలో గణితశాస్త్రం ఎంతగానో పెనవేసుకొని ఉన్నదని, మనం ఉదయం నిద్ర మేలుకోవడంతో మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు జరిగే ప్రతి చర్యలన్నింటిలో గణిత శాస్త్రం ఇమిడి ఉంటుందని, మనకు తెలియకుండానే మనం ఎన్నో గణిత చర్యలను చేస్తుంటామని తెలిపారు. విద్యార్థులలో గణిత పరిజ్ఞాన సృజనాత్మకత అభివృద్ధి చెందడానికి పాఠశాలల్లో ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని వాటి ద్వారా విద్యార్థులు గణిత అంశాలను సులభంగా నేర్చుకుంటారని చెప్పారు.

ఆధునిక శాస్త్ర సాంకేతిక టెక్నాలజీ రంగాలన్నింటిలో గణితం ముఖ్యమైన భూమిక పోషిస్తుందని, విద్యార్థులు ప్రాథమిక దశ నుండి గణితాన్ని నేర్చుకున్నట్లయితే ఉన్నత చదువుల్లో భయం లేకుండా గణిత సమస్యలను సులభంగా సాధించగలుగుతారానీ వారు సూచించారు.