ఎస్పీఎం కార్మికుల సమస్యలను ప్రభుత్వం తీర్చాలి

ఎస్పీఎం కార్మికుల సమస్యలను ప్రభుత్వం తీర్చాలి
– ట్రాన్స్ఫార్మర్స్ రిపేరింగ్ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొమ్మకంటి జానకిరాములు
– ఇటీవల మృతి చెందిన ఎస్పీఎం కార్మికుడి కుటుంబానికి ఆర్థికసాయం

నకిరేకల్ : ఎస్పీఎం కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎస్పీఎం (తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్స్ రిపేరింగ్) కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొమ్మకంటి జానకిరాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఇటీవల మృతి చెందిన మిర్యాలగూడలో పనిచేసే ట్రాన్స్ఫార్మర్స్ రిపేరింగ్ కార్మికుడు బొద్దు సైదులు కుటుంబనికి తోటి కార్ముకులు సేకరించిన 34,300 రూపాయల ఆర్హికసాయాన్ని ఆదివారం నకిరేకల్ లోని అయన ఇంటిలో కుటుంబసభ్యులకు బొమ్మకంటి జానకిరాములు అందజేశారు.

అనంతరం రాష్ట్రంలోని ఎస్పీఎం కార్మికుల సమస్యలపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం జానకిరాములు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలు ఎన్నో అవస్థలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబాలను ఆదుకునే దిక్కు లేకుండా పోతుందని తెలిపారు. రైతులకు సకాలంలో ట్రాన్స్ ఫార్మర్లను మరమ్మతు చేసి ఇస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో మిర్యాలగూడ, నకిరేకల్ ఎస్పీఎం కార్మికులు తేరాల శ్రీనివాస్, చిన్న శ్రీను, సైదిరెడ్డి, జిడుగు సోమయ్య గణేశ్, సందీప్, అంజయ్య, రాములు, నజీర్, కృష్ణ, వెంకన్న, వెంకటేష్, ఎస్సార్ శ్రీను, ఆర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.