ఉత్తమ్ గారూ.. ఊర చెరువులను సాగర్ నీటితో నింపండి

ఉత్తమ్ గారూ.. ఊర చెరువులను సాగర్ నీటితో నింపండి
* క్రాంతినికేతన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సుంకర క్రాంతికుమార్
సూర్యాపేట, రచ్చబండ: సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని గ్రామాల్లో తాగునీటి ఇబ్బందిని తొలగించేందుకు నాగార్జున సాగర్ నీటితో చెరువులను నింపించాలని సాగునీటి శాఖా మంత్రి, హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఎన్ ఉత్తమకుమార్ రెడ్డిని క్రాంతినికేతన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సుంకర క్రాంతి కుమార్కో రారు.

గురువారం అయన నేరేడుచర్లలో విలేకరులతో మాట్లాడుతూ ఎండాకాలం రాక మునుపే గ్రామాల్లో, పట్టణాల్లో నీటి ఎద్దడి నెలకొన్నదని పేర్కొన్నారు. దీంతో ప్రజలు అటు సాగు, తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిష్కరించేందుకు సాగర్ ఆయకట్టు ప్రాంతంలో గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న చెరువుల్ని నీటితో నింపాలని విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికి అన్ని గ్రామాల్లో చెరువుల్లో నీరు ఇంకిపోవడంతో బోర్లు, బావులు చాలావరకు అడుగంటి పోయాయని, చాలాచోట్ల ఇంటి అవసరాలకు వాడుకునే నీరు సైతం దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారు చొరవచూపి గ్రామాల్లోని ఊర చెరువుల్లో నీటిని నింపితే నీటి నిల్వలు పెరుగుతాయని, రాబోవు రోజుల్లో తలెత్తే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.

లేకుంటే నీటి ఇబ్బందులు తప్పవని అన్నారు. మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా అందే నీరు అన్ని వీధులకు వెళ్లడం లేదని వాటిపైనా దృష్టి సారించాలని కోరారు.