ఇంటర్లో సత్తా చాటిన శంకర్ పల్లి మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు

ఇంటర్లో సత్తా చాటిన శంకర్ పల్లి మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు

రచ్చబండ శంకర్ పల్లి: ఇంటర్మీడియట్ పరీక్ష ప్రథమ, ద్వితీయ పరీక్షా ఫలితాల్లో శంకర్ పల్లి తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సీనియర్ ఇంటర్ సీఈసీ విభాగంలో హర్షవర్ధన్ 930 మార్కులు, ఏ. భార్గవి 928, కె. భాగ్యలక్ష్మి 852, బైపిసి విభాగంలో కె. సోనీ 930 మార్కులు, కె. అక్షిత 907, టి. కావ్య 904. ఎంపీసీ విభాగంలో జి. వైష్ణవి 854, మొదటి సంవత్సరం విద్యార్థుల్లో వి. జాకేష్ 354, ఎంపీసీ. సంజన 294 బైపిసి, ఎస్. అర్చన 385 సిఇసి మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం 56%, ద్వితీయ సంవత్సరం 60 శాతం ఫలితాలు సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ జి. మహేశ్వరరావు తెలిపారు. తమ పాఠశాల నుండి ఉత్తమ మార్కులు పొందినందుకు విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు రాఘవేందర్ రెడ్డి, అధ్యాపక బృందం ప్రత్యేక అభినందనలు తెలిపారు.