ఆ దుకాణాలకు ఉచిత విద్యుత్తును అందించండి

ఆ దుకాణాలకు ఉచిత విద్యుత్తును అందించండి

* వాటిలో పనిచేసే వారికీ బీమా సౌకర్యం కల్పించాలి

* మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి

రచ్చబండ, హైదరాబాద్ : మెడికల్ షాపులకు ఉచిత విద్యుత్తును అందించాలని ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ కార్యవర్గ సబ్యులు డాక్టర్ పెండెం కృష్ణకుమార్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు.

మంగళవారం సచివాలయంలో మంత్రిని కలిసిన అయన క్లాత్ బ్యాగులను తన కళాత్మక చిత్రాలతో కూడిన నూతన క్యాలెండర్ ను అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ కుమార్మం త్రికి పాళీ విషయాలను విన్నవించారు. ఎన్నో విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు లెక్క చేయకుండా కెమిస్ట్ లు బాధ్యతతో నిరంతరం నిర్విరామంగా సెలవు దినాలు లేకుండా ఏ సమయంలోనైనా వృత్తి ధర్మంతో సేవలు అందిస్తున్నారని చెప్పారు.

మెడికల్ షాపులలో కొన్నిరకాల మందులకు 24 గంటలు కోల్డ్ స్టోరేజ్ అవసరం ఉన్నందున ఫ్రిజ్ ను ఎల్లప్పుడూ ఆన్ లో ఉంచాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. కావున ప్రజా ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని విద్యుత్ ఉచితంగా అందించాలని,, లేదా డొమెస్టిక్ స్లాబ్ లో అందించాలని మంత్రిని కోరారు. రోగులకు మందులు ఇచ్చే సమయంలో వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నందున కెమిస్ట్ లకు, ఫార్మసిస్ట్ లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మంత్రిని కృష్ణకుమార్ కోరారు.