అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందజేయడమే లక్ష్యం
* మాజీ ఎమ్మెల్యే కెఎస్.రత్నం
రచ్చబండ, శంకర్ పల్లి; రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటానని మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం అన్నారు. శనివారం శంకర్ పల్లి మండలంలోని శేరిగూడ, కొండకల్, మోకిలా తండా, మోకిలా గ్రామాలలో గడపగడపకు రత్నం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నెలనెలా పింఛన్లు అందించడం జరుగుతున్నదని తెలిపారు.
రైతులకు రైతుబంధు, రైతు బీమా సంక్షేమ పథకాలను అందించి వారి సంక్షేమ కొరకు పాటుపడుతున్నారని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి గ్రామానికి త్రాగే నీటిని అందిస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు. పార్టీ టికెట్ ఎవరికి వచ్చిన వారి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల పనిచేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కొండకల్ ఎంపీటీసీ బద్దం సురేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బీర్ల నరసింహ, జనవాడ వార్డు సభ్యుడు శివ, మోకిలా మాజీ ఎంపీటీసీ యాదయ్య, శంకర్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్ గండేటి శ్రీనాథ్ గౌడ్, నాయకులు గోవింద్ రెడ్డి, బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సింహం రాజు, శంకర్ నాయక్, రజనీకాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు.