అంబేద్కర్ త్యాగాల ఫలితంగానే ప్రజలకు స్వేచ్ఛా వాయువులు
* ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త మర్పల్లి అశోక్
* శంకర్ పల్లిలో రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు
రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపాలిటీలో బుధవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా మండల అంబేద్కర్ సంఘం, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా శంకర్ పల్లి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త మర్పల్లి అశోక్ మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత చదువులు చదివి సమ సమాజ నిర్మాణం కోసం వారి కుటుంబాన్ని పణంగా పెట్టి ఎంతగానో కృషి చేశారని, వారి త్యాగ ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ వాయువులను పీల్చుకోగలుగుతున్నామని గుర్తుచేసి,నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు.
అనంతరం అంబేద్కర్ జ్ఞాపకార్థం మున్సిపాలిటీ సిబ్బందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, పిఎసిఎస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు విజయ్, నర్సింలు, మాజీ మండల అధ్యక్షుడు చిన్న నరసింహులు, అంబేద్కర్ సంగం అధ్యక్ష కార్యదర్శులు వెంకటయ్య, శంకరయ్య, కార్యవర్గ సభ్యులు రామచందర్, నగేష్, బాలకిషన్, రాములు, శంకరయ్య, లక్ష్మయ్య,శ్రీశైలం, బీఎస్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్పల్లి అశోక్, జిల్లా కార్యదర్శి బాలరాజు,సభ్యులు రాజు,లింగమయ్య,నగేష్, షీల్దాస్,లిటిల్ స్టార్ హై స్కూల్ కరస్పాండెంట్ సంజీవ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్,ప్రసాద్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.