సత్యనారాయణ వ్రతం ద్వారా ప్రతి ఒక్కరికీ భక్తి, ముక్తి
* జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీ భాస్కర యోగి
* శంకర్ పల్లిలో సామాజిక సమరసత ఆధ్వర్యంలో సామూహిక వ్రతాలు
రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లిలోని డిఎంఆర్ గార్డెన్స్ లో ఆదివారం సామాజిక సమరసత ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. సత్యనారాయణ వ్రతాలకు వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సత్యనారాయణ పూజా కార్యక్రమాల అనంతరం జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీ భాస్కర యోగి మాట్లాడుతూ భక్తి భావన మనం పూజ, వ్రతం, యజ్ఞం, యాగం రూపాల్లో వెలిబుచ్చుతాము అని, పంచభూతాలకు కులం, మతం, బీద, ధనిక వ్యత్యాసం లేదు అని, గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని అందరినీ ఒకేలా చుస్తాయని అన్నారు. నారాయణుడు సత్యం అని, సత్యనారాయణ వ్రతం ద్వారా భక్తి, ముక్తి లభిస్తాయని అన్నారు.
కార్యక్రమంలో దేవేందర్ రాజు విభాగ్ ప్రచరక్, కేరెళ్ళి అనంత రెడ్డి విభాగ్ కర్యవాహా దామోదర్ రెడ్డి సామాజిక సమరసత కన్వీనర్, స్వయం సేవకులు,కార్యకర్తలు శ్రీపాల్ రెడ్డి,నాగిరెడ్డి అచ్చిరెడ్డి రాజు పంతులు ఉపాద్యాయులు నందు,లక్ష్మారెడ్డి, దేవేందర్ రెడ్డి,శ్రీనివాస్ చారి,శ్రీనివాస్ బాలాజీ,మొగులయ్య,రమేష్ రాములు,యాదయ్య,శ్రీకాంత్ రాజేందర్,హరిశంకర్, వెంకటేశ్వర్ గారు, వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.