శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆధ్వర్యంలో స్పర్శ అక్షింతల వితరణ

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆధ్వర్యంలో స్పర్శ అక్షింతల వితరణ

రచ్చబండ, శంకర్ పల్లి: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం శంకర్ పల్లి రైల్వే యార్డులో గల శ్రీరామ మందిరం దేవాలయంలో మండలంలోని గ్రామాలకు స్పర్శ అక్షింతల వితరణ కార్యక్రమం భక్తి ప్రపత్తులతో జరిగింది.

జనవరి ఒకటవ తేదీ నుండి 15 తేదీ వరకు అక్షంతలు శ్రీరాముల వారి ఫొటో, కరపత్రం పంపిణీ వివరాలను జిల్లా ప్రచార రమేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత విభాగ కో కన్వీనర్ దామోదర్ రెడ్డి, జిల్లా సహకార వాహ నరసింహులు, విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు రంగనాథ్, ఖండ కార్యవాహ నాగిరెడ్డి, శంకర్ పల్లి మాజీ సర్పంచ్ వై. ప్రకాష్ గుప్తా, కవ్వగూడం శ్రీనివాస్, నితిన్, విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మిరియాల కాశీనాథం, చేకూర్త కృష్ణారెడ్డి, పూజారి రాజు పంతులు, తరసేవకులు, భక్తులు, మాతృ శక్తి కార్యకర్తలు పాల్గొన్నారు.