శంకర్ పల్లి ఆదర్శ పాఠశాలలో ఇన్నోవేషన్ ఫెస్ట్-2023-24 నిర్వహణ

శంకర్ పల్లి ఆదర్శ పాఠశాలలో ఇన్నోవేషన్ ఫెస్ట్-2023-24 నిర్వహణ

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి లోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో బుధవారం స్టీమ్ స్పార్క్ ఇన్నోవేషన్ ఫెస్ట్ 2023- 24 కార్యక్రమాన్ని సిజిఐ ఎల్ఎల్ఎఫ్, ఏ ఎం ఐ, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ వినాయక్ రెడ్డి, సిజిఐ డైరెక్టర్ కిరణ్, సిజిఐ సిఎస్ఆర్ హైదరాబాద్ హెడ్ రమేష్, సిజిఐ సిఎస్ఆర్ నందిత, మెంబర్ రమేష్, దౌల్తాబాద్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ యజ్ఞశ్రీ, శంకర్ పల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్, జి. మహేశ్వరరావు, ఎల్ ఎల్ ఎఫ్ చీఫ్ మేనేజర్ రాజ్ కిషోర్, ఎల్ ఎల్ ఎఫ్ మేనేజర్ సమీర్ కుమార్ పాల్గొన్నారు.

ఈ ఫెస్ట్ లో వరంగల్ భద్రాచలం, సిద్దిపేట్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, మోడల్ స్కూల్ కి చెందిన సుమారు 15 మంది విద్యార్థులు రూపొందించిన 50 కి పైగా సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. వీటి పరిశీలనకు సిజిఐ డైరెక్టర్ కిరణ్, టేకి యాన్ టెక్నాలజీస్ పౌండర్ సీఈవో హరీఫ్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ బివై జె యు ఎస్ సోనల్ శ్రీ వాస్తవం జడ్జీలుగా వ్యవహరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సింగరేణి క్యాలరీస్ ఇల్లెందు ప్రథమ బహుమతి అందుకోగా ద్వితీయ బహుమతిని శంకర్ పల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు అందుకున్నారు, తృతీయ బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విజయనగర్ కాలనీ, హైదరాబాద్ కు చెందిన విద్యార్థులు అందుకున్నారు. శంకర్ పల్లి విద్యాధికారి సయ్యద్ అక్బర్, స్థానిక మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్ విద్యార్థులకు బహుమతులను అందించారు.