Home Latest News పాత పెన్షన్ విధానం అమలుపర్చడం హర్షణీయం

పాత పెన్షన్ విధానం అమలుపర్చడం హర్షణీయం

పాత పెన్షన్ విధానం అమలుపర్చడం హర్షణీయం

* సీపీఎస్ నేతలు తాహేర్ అలీ, దర్శన్ గౌడ్, మర్పల్లి అశోక్
రచ్చబండ, శంకర్ పల్లి: నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పిన మాటకు కట్టుబడి శనివారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయడం హర్షించదగ్గ విషయమని, తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు తాహేర్ అలీ, ఉపాధ్యక్షులు దర్శన్ గౌడ్, అసోసియేట్ అధ్యక్షుడు మర్పల్లి అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 2004 నుండి ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చినటువంటి ఉద్యోగ,ఉపాధ్యాయులు సిపిఎస్ విధానంలో కొనసాగడం జరుగుతుందని చెప్పారు.

వారికి పదవీ విరమణ అనంతరం ఆసరా పెన్షన్ కంటే మరి తక్కువగా పెన్షన్ రావడం జరుగుతుందని పెన్షన్ కోసం గత పది సంవత్సరాల నుండి రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు, నిరసనలు, పాదయాత్రలు చేస్తూ తమ గోడును ప్రభుత్వానికి గట్టిగా వినిపించినప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేకపోయాయని తెలిపారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షను నెరవేర్చడానికి ఒక అడుగు ముందుకు వేసిందని తెలిపారు. అందుకు గాను రాష్ట్రంలోని రెండు లక్షల సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ నూతన ప్రభుత్వానికి కృతజ్ఞత భావంతో ఉన్నట్టు చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాము శర్మ, కవ్వగుడెం శ్రీను, మునీర్ పాషా, వెంకటేష్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుదర్శన్, సంజీవ్ కుమార్, దేవేందర్ రెడ్డి, నారాయణ, శ్రీనివాస్ చారి, శ్రీను, ఊరడి. వెంకటేష్, కోడి కృష్ణ, వరప్రసాద్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.