నేరాల గుర్తింపులో సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకం
– రాజేంద్రనగర్డీ డీసీపీ శ్రీనివాస్
రచ్చబండ. శంకర్ పల్లి: కొత్తగా రాజేంద్రనగర్ జోన్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన సిహెచ్. శ్రీనివాస్ బుధవారం శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన 106 సీసీ కెమెరాలు డీసీపీ పరిశీలించి స్థానిక పోలీసులను అభినందించారు. శంకర్ పల్లి పట్టణంలో సీసీ కెమెరాలు ద్వారా నేరాలను నియంత్రించవచ్చని అన్నారు.
నేరాల గుర్తింపులో సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకమైంది అన్నారు. పట్టణంలో ప్రతి ఒక్కరు తమ ఇళ్ళకు, దుకాణాల సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సి ఐ వినాయక్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.