ఉపాధ్యాయులు మర్పల్లి అశోక్, తాహెర్ అలీకి సేవా రత్న అవార్డులు
రచ్చబండ, శంకర్ పల్లి: ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారిచే ఆదివారం హైదరాబాదులో జరిగిన వరల్డ్ హుమాన్ రైట్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా జాతీయ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్, తెలంగాణ చైర్మన్ డాక్టర్ నోముల సంతోష్ గౌడ్ చేతుల మీదుగా ఎడ్యుకేషన్, అండ్ సోషల్ సర్వీస్ కేటగిరీలో సేవారత్న అవార్డును ప్రదానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మర్పల్లి అశోక్, తహేర్ అలీ మాట్లాడుతూ, ప్రభుత్వ బడులలో చదువుకుంటున్న పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం,వారి చదువు కోసం, వారి చదువులకు ఉపయోగపడే విద్యాసామాగ్రిని,స్వచ్ఛంద సంస్థల సహకారంతో, దాతల సహకారంతో, తన నెలవారి జీతంలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం కేటాయించి తన టైం,టాలెంట్,ట్రెజరీ అందిస్తూ విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా నిరంతర విద్య కోసం కృషి చేసినందుకు గాను, సమాజంలోని మహిళలకు,యువతకు స్వయం ఉపాధిని కల్పించడానికి తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను గుర్తింపుగా అవార్డును అందుకోవడం జరిగిందని,
ఈ అవార్డుతో మా బాధ్యతను మరింత పెంచిందని నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతామని తెలిపారు. కార్యక్రమంలో రాజేష్ గౌడ్, రాఘవేందర్ రెడ్డి, ఉపాధ్యాయురాలు పద్మజ, ఆనంద్, కుమార్ అవార్డులను అందుకోగా లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.