ఆటో బోల్తా.. ఒక వ్యక్తి దుర్మరణం
రచ్చబండ, శంకర్ పల్లి: ఆటో బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంగా మహబూబాబాద్ జిల్లా నుంచి బతుకుతెరువు కోసం వచ్చి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాటి గ్రామంలో ఉంటున్నారు.
ఈనెల 17వ తేదీ కంది బైపాస్ రోడ్డు నందుగల మీడియన్ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ నిమిత్తం టాటా ఎస్ వాహనంలో డ్రైవర్ అస్లాం 15 మందిని ఎక్కించుకొన్నాడు. 12 మందిని కంది చౌరస్తా వద్ద దింపి వేసి మిగిలిన ముగ్గురిని ఆటోలో శంకర్పల్లిలోని ఫతేపూర్ బ్రిడ్జి వద్ద దింపేందుకు వస్తున్నాడు. కంది బైపాస్ రోడ్డు నుంచి సింగపురం గ్రామానికి మళ్లే రోడ్డు వద్దకు రాగానే ఆటో బోల్తా పడింది. ఆటో వెనకాల కూర్చున్న పులి సారయ్య (60) అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆయన భార్య వనమ్మ, కూతురు పులి స్వరూపకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు శంకర్పల్లి పోలీసులు తెలిపారు. ఈ మేర కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శంకరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వినాయక రెడ్డి తెలిపారు.