యున్-యు లిన్ రిజ్యూమే రహస్యాలు: 9 సంవత్సరాల నిరంతర ప్రయాణం నుండి $350,000 గూగుల్ ఉద్యోగం
యున్-యు లిన్, 18 సంవత్సరాల టెక్ కెరీర్ గల ఒక సక్సెస్ స్టోరీ. తైవాన్‌లో ఒక కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ గా మొదలై, సెమికండక్టర్ ఇంజనీర్ గా కెరీర్ ప్రారంభించి, చివరికి గూగుల్‌లో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా ఎదిగాడు. ఈ ప్రయాణంలో అతను తన రిజ్యూమేను నిరంతరం అప్‌డేట్ చేయడం, కచ్చితమైన డాక్యుమెంటేషన్ చేయడం ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలను అందుకున్నాడు.
లిన్ యొక్క కెరీర్ మార్పులు:
– తైవాన్ నుండి యాహూ వరకు: మొదట, లిన్ తైవాన్‌లోని ఒక చిప్ మేకింగ్ కంపెనీలో ఇంజనీర్‌గా nearly 5 సంవత్సరాలు పని చేసి, హార్డ్‌వేర్ అతనికి సరిపోదని తెలుసుకున్నాడు. 2011లో యాహూలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరి, అక్కడ ప్రొడక్ట్ మేనేజర్ జాబ్ చేస్తున్న ఒక వ్యక్తిని చూసి ఎలా అయిన సరే నా ఈ జీవితంలో ప్రాడక్ట్ మేనేజర్ గా చేయాలని లిన్ గట్టిగా అనుకున్నాడు.
– యుఎస్ MBA: 2014లో అతను యునివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియాలో ఎంబిఏ పూర్తి చేసి, Metaలో డేటా సైంటిస్ట్‌గా పని చేశాడు.
– ప్రొడక్ట్ మేనేజ్మెంట్‌కి మార్పు: 2018లో వీసాలో డేటా ప్లాట్‌ఫాం ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరి, ఆ తరువాత పేపాల్ మరియు గూగుల్ లో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా ఎదిగాడు.
రిజ్యూమే స్ట్రాటజీ:
1.Connect the Dots: లిన్ తన విభిన్న అనుభవాలను కలిపి, అన్ని ఎక్స్‌పీరియెన్స్‌లను జాబ్ కి తగ్గటు రెస్యూమే లో యాడ్ చేశాడు.
2.కెరీర్ లెవల్ ప్రకారం కస్టమైజ్ చేయడం: స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యాక తన విద్యకు ప్రాధాన్యత ఇచ్చి, తరువాత తన అప్‌డేటెడ్ రోల్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.
3.Additional Information Section: ఈ సెక్షన్‌లో అతను ఇతర సర్టిఫికేషన్స్ మరియు స్కిల్స్ ని చూపించి, జాబ్ డెస్క్రిప్షన్‌కి మ్యాచ్ అయ్యేలా తన రిజ్యూమేను కస్టమైజ్ చేశాడు.
4. Segregating Applications: లిన్ తన అప్లికేషన్లను మూడు టియర్లుగా విభజించి, టియర్ 1 కంపెనీల కోసం పూర్తిగా కస్టమైజ్ చేసిన రిజ్యూమేను వాడాడు, మరియు టియర్ 3 కంపెనీల కోసం ఒకే రిజ్యూమేను ఉపయోగించాడు.
విజయం:
2015లో ఎంబిఏ చేస్తుండగా సృష్టించిన రిజ్యూమే లిన్‌కు Meta, Visa, PayPal లాంటి కంపెనీల్లో ఉద్యోగాలను అందించింది. 2022లో అదే రిజ్యూమే అతనికి గూగుల్‌లో $350,000 ప్యాకేజ్‌ను తెచ్చింది.
లిన్ యొక్క రిజ్యూమే విజయం అనేది ఒక స్ట్రాటజిక్ ప్లాన్‌తో మాత్రమే సాధ్యమైంది.