గోల్కొండ కోట పంద్రాగస్టు వేడుకలకు సూర్యాపేట డప్పు కళాకారుల బృందం
– మహిళా కళాకారులతో డప్పు నృత్య ప్రదర్శనకు అవకాశం
రచ్చబండ, సూర్యాపేట: ఈ నెల 15న రాష్ట్ర రాజధాని అయినా హైదరాబాద్ లోని చారిత్రక గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రముఖ కళాకారుడు సతీష్ నేతృత్వంలోని సూర్యాపేట డప్పు కళాకారుల బృందం దరువు మోగనుంది. ఈ వేడుకల్లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన సతీష్ డప్పు కళా బృందం మహిళా కళాకారులూ పాల్గొననున్నారు.
ఇప్పటికే పలు సంస్కృతిక వేడుకల్లో సతీష్ డప్పు కళా బృందం కళాకారులు విశేష ప్రతిభను చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర తరపున తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డాక్టర్మా మిడి హరికృష్ణ సహకారంతో అందె మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అందె భాస్కర్ సౌజన్యంతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డప్పు ప్రదర్శనకు అవకాశం రావడం సంతోషకరమని డప్పు కళాకారుడు, మాస్టర్ అమరవరపు సతీష్ తెలిపారు. పల్లెటూరు నుంచి వచ్చిన మహిళలు రాష్ట్ర రాజధానిలో డప్పు కొట్టడం ఆనందంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. గోల్కొండ కోటలో పాల్గొనే డప్పు కళాకారులూ అందరూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన వారేనని సతీష్ తెలిపారు.