హైకోర్టు అడ్వకేట్ గా సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బంటు కృష్ణ

హైకోర్టు అడ్వకేట్ గా సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బంటు కృష్ణ- హైకోర్టు అడ్వకేట్ గా నమోదు
– జర్నలిజంలో గోల్డ్ మెడలిస్ట్
– పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్
– యూనియన్ నేతగా గుర్తింపు

రచ్చబండ, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, జర్నలిజం లో పీహెచ్డీలో డాక్టరేట్ పొందిన డాక్టర్ బంటు కృష్ణ సోమవారం హైకోర్టు అడ్వకేట్ గా నమోదు చేసుకొని జీవితంలో మరో మెట్టు ఎక్కారు. అంచలంచెలుగా పురోగతి సాధిస్తూ వస్తున్న అయన జర్నలిజంలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ తోపాటు గోల్డ్ మెడల్ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నారు. విద్యా రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకొని సూర్యాపేట జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయిలో మారు మ్రోగించారు. ఈ వయసులో ఏమి చదువు అని కొందరు నిరుత్సాహ పరిచినా, చదువుకు వయసు అడ్డంకి కాదు అని నిరూపించారు. ఎందరో మహానుభావులు అందించిన ప్రోత్సాహంతో పాటు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనతో ముందుకు సాగుతూ రాజ్యాంగపు విలువలను భావితరాలకు అందించాలనే దృఢ సంకల్పంతో ఎల్ఎల్బీ హానర్స్ కూడా పూర్తి చేసి హైకోర్టు అడ్వకేట్ గా ఎన్రోల్మెంట్ పూర్తి చేసి అడ్వకేట్ గా నిలవడం జీవితంలో మరో కలికి తురాయి.

రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టుగా
డాక్టర్ బంటు కృష్ణ పట్టుదల, నమ్మకం, పట్టు విడవని దృడ సంకల్పంతో ఒకవైపు చదువులో రాణిస్తూనే 31 సంవత్సరాలుగా జర్నలిజం లో రాణిస్తూ వస్తున్నారు. అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యాసాలు రాసి రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకోవడం జీవితంలో మరపురాని మరో విజయ సంకేతం. కవిగా, రచయితగా,
టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్ట్ యూనియన్ సూర్యాపేట ప్రధాన కార్యదర్శిగా అయన కొనసాగుతున్నారు.


వెన్నుతట్టి ప్రోత్సహించిన వారికీ రుణపడి ఉంటా
ఆప్యాయత, అనురాగాలు, అనుబంధాలు పంచిన నేను పుట్టిన ఊరు, జన్మనిచ్చి పెంచిన తల్లిదండ్రులు, అన్నివేళలా అండగా నిలిచిన కుటుంబం, విద్యను అందించిన గురువులు, ఆదరించి ఆదుకున్న స్నేహితులు, బంధువులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఇలా జీవిత ప్రయాణంలో నాకు సాయం అందించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా. వెన్నుతట్టి ప్రోత్సహించిన ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరి మమతాను రాగాలు, ఆశీస్సులు, దీవెనలు ఇకముందు కూడా అందించాలని, అందిస్తారని కోరుకుంటున్నా.
– డాక్టర్ బంటు కృష్ణ, సీనియర్ జర్నలిస్ట్, హైకోర్టు అడ్వకేట్