జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సీఎంతో చర్చిస్తా

Minister Ponnam Prabhakar to Discuss Journalist Housing with CM Revanth Reddy

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సీఎంతో చర్చిస్తా
– జీహెచ్ జే సొసైటీ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ
రచ్చబండ, హైదరాబాద్: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి మండలి దృష్టికి తీసుకెళ్లి త్వరలో సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న తమ సొసైటీకి ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి కోరారు. సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ మంత్రికి జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్యను వివరించారు. తమ సొసైటీలో దాదాపు 1,400 మంది జర్నలిస్టులు ఉన్నారని, వీరిలో చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లు కాలయాపన చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులంతా తమకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారని మంత్రితో అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు ఇస్తామని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి కేబినెట్ ఆమోదం ద్వారా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలిస్తామని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో సొసైటీ ప్రతినిధులు పులిపలుపుల ఆనందం, సీతారామరాజు, వీరారెడ్డి, పి.నాగవాణి, వేముల పుష్పలత, డి. వెంకట్ రెడ్డి తదితరులున్నారు.