Kadiam Srihari Congress backlash: బీఆరెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరికి ఆ పార్టీ నేతల షాకిచ్చారు. తొలి నుంచి ఆయనను స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఆ పార్టీ లోకల్ క్యాడర్ ఇముడ్చుకోలేకపోతున్నది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పార్టీ, ప్రభుత్వ పదవుల్లో తొలి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నవారికి కాకుండా కొత్తగా వచ్చిన తన వర్గీయులకే కడియం శ్రీహరి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి వైఖరికి నిరసనగా ఏకంగా ధర్మసాగర్ మండలం కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బైఠాయించి రాస్తారోకోకు దిగారు. స్థానిక కాంగ్రెస్ నేత సింగాపురం ఇందిర మద్దతు దారులు ఈ ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Also Read: మళ్లీ నాగార్జున సాగర్‌కు వరద పరవళ్లు