డప్పు కళాకారుడు అమరవరపు సతీష్ కు “జానపద సామ్రాట్ పురస్కారం

Janapada Samrat Puraskar

డప్పు కళాకారుడు అమరవరపు సతీష్ కు “జానపద సామ్రాట్ పురస్కారం”
రచ్చబండ, సూర్యాపేట: డప్పు కళకు అందిస్తున్న విశేష సేవలకు గాను సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన యువ డప్పు కళాకారుడు అమరవరపు సతీష్ “జానపద సామ్రాట్” గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. రైటర్స్ అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి చేతుల మీదుగా అవార్డును అందజేసి ఆయనను ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక కమిషన్, తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రపంచ జానపద దినోత్సవాన్ని (22-08-2024) పురస్కరించుకొని విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రం వేదికగా ఉత్తరాంధ్ర జానపద జాతర 2024ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.

Janapada Samrat Puraskar" Awarded to Immortal Drum Artist Amaravarapu Satish

ఈ కార్యక్రమంలో సతీష్ డప్పు కళాకారుల బృందం విన్యాసం, ఒగ్గు డోలు విన్యాసాల ప్రత్యేక ప్రదర్శనలు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ప్రఖ్యాత చలనచిత్ర నటులు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, రైటర్స్ అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సతీష్ కు “జానపద సామ్రాట్” అవార్డు రావడానికి సహకరించిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణకు, అందె మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అందె భాస్కర్ కు సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ మహిళా డప్పు కళా బృందం సభ్యులు అపర్ణ, గంగ, రమణ, సంధ్య, మార్తా, జ్యోతి, అనిత, వీరబాబు, శోభన్ , కల్పనా, స్వరూప, నాగమణి, రేణుక, రాణి, రజిత, ధనమ్మ, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.