- అంబరాన్నంటిన జన్మదిన వేడుకలతో సరికొత్త ఊపు
- కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా సందడి
- వందలాది మంది మహిళలకు చీరల పంపిణీ
- భారీ ర్యాలీతో కార్యకర్తలు, అభిమానుల్లో జోష్
రచ్చబండ, ఆమనగల్లు : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డికి కల్వకుర్తి నియోజకవర్గంలో మరింత క్రేజీ పెరిగిందని రుజువైంది. ఆదివారం జరిగిన ఆయన జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జీఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోలి జన్మదినం సందర్భంగా కడ్తాల్ నుంచి మైసిగండి, ఆమనగల్లు, వెల్దండ మీదుగా కల్వకుర్తి వరకు భారీ కార్, బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సందడి చేశారు.
ర్యాలీలో జీఎస్సార్ అనుకూల నినాదాలతో జాతీయ రహదారి అడుగడుగునా హోరెత్తింది. ర్యాలీలో గోలి శ్రీనివాస్ రెడ్డి ఓపెన్ టాప్ జీపుపై నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు. కడ్తాల్, మైసిగండి, విఠాయిపల్లి, ఆమనగల్లు, వెల్దండ, కల్వకుర్తిలో పార్టీ శ్రేణులతో కలిసి శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కడ్తాల్ లో భారీ గజమాలను క్రేన్ తో గోలి శ్రీనివాస్ రెడ్డికి వేసి అభిమానులు సన్మానించారు.
మైసిగండి మైసమ్మ ఆలయం వద్ద శ్రీనివాస్ రెడ్డి అమ్మవారి పూజలు నిర్వహించారు. రాఘాయిపల్లి వద్ద జరిగిన జన్మదిన వేడుకల్లో ఎంపీ పొతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథ్, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, మున్సిపల్ చైర్మన్ సత్యం, పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజాసంఘాల నేతలు జిఎస్సార్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
నాయకులతో కలిసి గోలి శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేశారు. సుమారు 2500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పలుచోట్ల మొక్కలు నాటి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గోలి శ్రీనివాస్ రెడ్డికి మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు బాల్ రాజ్, జనార్దన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్ , మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, వైయస్ఆర్ టిపి నియోజకవర్గ ఇన్చార్జి చీమర్ల అర్జున్ రెడ్డి, టిడిపి నియోజకవర్గ కోఆర్డినేటర్ యాదిలాల్ తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆయా చోట్ల జరిగిన వేడుకల్లో నాలపురం శ్రీనివాస్ రెడ్డి, దశరథ్ నాయక్, కంలీ మొత్యా నాయక్, గంప వెంకటేష్, గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి, వీరయ్య, సేవ్యా నాయక్, సుభాష్, చంద్ర శేఖర్ రెడ్డి, సుమన్ నాయక్, రూపం వెంకట్ రెడ్డి, పత్యానాయక్, శంకర్ నాయక్, అనంత రెడ్డి, కేశవులు, జైపాల్ రెడ్డి, విజితా రెడ్డి, వస్పుల జంగయ్య, గోరటి శ్రీను, రాజశేఖర్, నాగులు, తిరుపతయ్య, అహ్మద్, భూపతిరెడ్డి, వెంకటయ్య, సంజీవ, స్వప్న, పంతునాయక్, తులసీరామ్ నాయక్, సతీష్, సాయినాథ్ రెడ్డి, అంజి, రమేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.