70 ఏండ్ల వయసుకు చేరుకోవాలంటే ఈ నియమాలు పాటించండి!

ఆరోగ్యమే మహాభాగ్యం.. అని పెద్దలు ఊరికే అనలేదు.. ఆ ఆరోగ్యమే మనిషి ఆయుష్షును పెంచుతుంది. అదే ఆరోగ్యం మనిషిని హాయిగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. మరి మనం ఆ ఆరోగ్యంగా ఉండాలంటే 10 విషయాలను పట్టించుకోవాలి. ఆ 10 విషయాలే మనలను అరవైలోనూ హుషారుగా ఉంచుతుంది. హాయిని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్ ఆగ్రా అనే సంస్థ విడుదల చేసిన 10 విషయాలు పరిశీలిద్దాం. మా చానల్ ను మొదటి సారి చూస్తున్న వాళ్లయితే వెంటనే సబ్ స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ చెయ్యండి. వీడియోను పూర్తిగా చూస్తేనే మీకు అవగాహన ఏర్పడుతుంది.

అరవైలోనూ హుషారుగా ఉండాలంటే పది విషయాలను పాటించాలి. 60 దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే 100కి 11 మంది మాత్రమే 60 దాట గలుగుతున్నారు. ఏడుగురే 65 దాటి 70 చేర గలుగుతున్నారు. మీరు ఆనందంగా ఉండడానికి పది ప్రధాన విషయాలను పాటించి మీ ఆయుష్షునూ పెంచుకోండి.

1. దప్పిక అనిపించినా లేకున్నా నీరు తాగుతూ ఉండాలి. రోజూ కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి.
2. ఆడుతారో, పాడుతారో తిరుగుతారో, నాట్యం చేస్తారో మీ ఇష్టం. కదులుతూ ఉండండి. లేకపోతే కీళ్లన్నీ బిగుసుకుపోతాయి.
3. బ్రతకడానికి తినండి, తినడానికి బతకకండి. పిండి పదార్థాలు బాగా తగ్గించి ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తినండి. ముఖ్యంగా రాత్రిపూట పిండి పదార్థాలు బాగా తగ్గించాలి.
4. వీలైనంత వరకు నడవండి లేదా సైక్లింగ్ చేయండి. 100 నుంచి 200 మీటర్ల దూరం కొరకు వాహనం వాడకండి, నడవండి.
– అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఎలివేటర్, రైల్వేస్టేషన్లలో ఎస్కలేటర్లు వాడటానికి అలవాటు పడిపోకుండా, మెట్లు ఎక్కండి. రాంప్ పై నడవండి. కొద్ది దూరాలకు వాహనం వాడకండి.
5. కోపం తగ్గించండి. తక్కువ మాట్లాడండి. ప్రియంగా మాట్లాడండి.
– మీ నివాస ప్రాంతంలో “కోప నిషేధ స్థలం” అని బోర్డు పెట్టండి. అది మీకు కోపం రాకుండా ఉంచుతుంది. మీ చుట్టూ ఉన్నవారికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది!

6. ధనంపై వ్యామోహం వదిలిపెట్టండి. జీవనానికి అవసరమైనంత వరకు మాత్రమే సంపాదించాలి.
– డబ్బు వెంట మీరు పరిగెత్తకండి.. డబ్బు మీ వెంట పరిగెత్తాలి!
7. మీరు కోరుకున్నది దక్కకపోతే బాధపడకండి. నిన్ను నీవు దూషించుకోవద్దు. ఆ విషయం మర్చిపోండి.
8. డబ్బు, తెలివి, సౌందర్యం, అధికారం, కులం, పదవి వీటివల్ల అహంకారం పెరుగుతుంది. వీటిని వదిలిపెట్టాలి. వీటికోసం పైవాటిపై నియంత్రణ సాధించాలి‌. వినయంగా ప్రజలతో, ప్రేమగా ఉండాలి. ఆనందంగా నవ్వుతూ గడపాలి.. అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు.
9. తెల్ల జుట్టు గురించి ఆందోళన వద్దు. తెల్లజుట్టు వార్దక్యానికి సంకేతం కాదు. దాని గురించి ఆందోళన పడకండి. కాళ్లు అనుమతించినంతకాలం యాత్రలు చేయండి. ఆనందంగా ఉండండి.
10. అందరితో స్నేహంగా కలిసి మెలిసి ఉండండి. ఒకొక్కప్పుడు చిన్నవారే మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు. నేను పెద్దవాడిని, అందరూ నాకు నమస్కరించాలి, గౌరవించాలి అని ఆశించకండి‌. నిశ్శబ్దంగా ఉన్న వారిని కూడా ఆప్యాయంగా పలకరించండి.

ఈ 10 విషయాలు గమనిస్తే, ఎంతో హాయిగా, ఆనందంగా, ఉత్సాహంగా కాలం గడిచిపోతుందని యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్ ఆగ్రా అనే సంస్థ తన నివేదికలో తేల్చి చెప్పింది. మరి మీరూ ఈ విషయాలను పాటిస్తారూ కదూ..