BJP Leader Thonda Ravi.. తొమ్మిదేండ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన
* బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి
రచ్చబండ, శంకర్ పల్లి: గత తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి తెలిపారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని బిజెపి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న పథకాలు, నిధులు ప్రజల్లోకి తీసుకెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం తామే సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నట్లు గొప్పలు చెప్పు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.
ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, సిసి రోడ్లు, వీధి దీపాలు, ప్రకృతి వనాలు, పట్టణాల్లో నిర్మించి ఆడిటోరియాలు, ఆసుపత్రులు, రోడ్లు, డ్రైనేజీలు గ్రామపంచాయతీ బిల్డింగులు, కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే పనులు చేపడుతున్నట్టు ఆయన చెప్పారు ప్రజలంతా ఏకమై బిఆర్ఎస్ ప్రభుత్వం ని వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా చేయాలని, బిజెపికి ఓటు వేసి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశాన్ని కాపాడుకోవా లని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ బీర్ల నరసింహ, మండల, మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు రాములు గౌడ్, బీర్ల సురేష్, పిల్లిగుండ్ల ఉపసర్పంచ్ ధరణి ఐలయ్య, నాయకులు రాజ్ కుమార్, సింహ రాజ్, రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.