హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ ప్రభంజనం

హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ ప్రభంజనం
* బీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న వలసల పర్వం
* ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వైపు జనం మొగ్గు
* ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న వైనం

రచ్చబండ, హుజుర్ నగర్ : ఎన్నికల పర్వం ఊపందుకోక ముందే.. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గంలో వలసల పర్వం బీఆర్ఎస్ పార్టీలో జోష్ నింపుతోంది. హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తోడు, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.

దీంతో మళ్ళీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అభ్యర్థిత్వాన్ని జనం సమ్మతిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గ్రామ, మండల శాఖలతో పాటు అనుబంధ శాఖలు పటిష్టంగా ఉన్నాయి. దీంతో ఈ చేరికలు తోడయితే శానంపూడి సైదిరెడ్డి మలి విడత ఎమ్మెల్యే కావడం సులువే అవుతిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేపట్టిన ఎమ్మెల్యేకు ఊరూరా జనం జేజేలు పలుకుతున్నారు.

తాజాగా బీసీ బంద్, గృహలక్ష్మి పథకాలతో జనం ఆ పార్టీ వైపు ఆకర్శితులు అవుతున్నారు. గత పథకాలకు తెలంగాణ ప్రభుత్వ పథకాలు భిన్నంగా ఉండటంతో పాటు ప్రజలకు పెద్ద ఎత్తున ఆసరా అవుతున్నాయి.

ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో 40 కుటుంబాల చేరిక
హుజుర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 40 కుటుంబాలు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ పథకాలన్వే పకడ్బందీగా అమలవుతున్నాయంటూ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా అమలుకావడం లేదన్నారు.

పార్టీలో చేరిన వారు తిరుపతయ్య చేపల సంఘం సొసైటీ మాజీ చైర్మన్, నాగేశ్వరరావు కృష్ణకుమారి, జొన్నలగడ్డ పుల్లయ్య అనసూర్య, జొన్నలగడ్డ నాగేశ్వరరావు సరిత, ఈద మహేష్ శిరీష, ఈద మహేందర్ మమత, ఈదా గోపి శిరీష, ఈద నాగయ్య వీరమ్మ, రామయ్య అక్కమ్మ, రణబోయిన వెంకయ్య, వార సైదులు ఈద నరసమ్మ, పుష్ప షేక్ హుస్సేన్ బిబీ షేక్ మహబూబ్ షేక్ మొగలా, పార్టీ లో చేరినారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.