యేసుక్రీస్తు మార్గం మానవాళికి ముక్తిమార్గం
* క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న భీమ్ భరత్
రచ్చబండ, శంకర్ పల్లి: సాటి వారిపట్ల ప్రేమతో వ్యవహరించాలి.. సన్మార్గంలో పయనించాలి అనే యేసు క్రీస్తు సూక్తులను ప్రతి ఒక్కరు అనుసరించాల్సిన అవసరం ఉందని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా సోమవారం శంకర్ పల్లి మండలం గోపులారం గ్రామంలోని చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం పాస్టర్స్ బ్రదర్ సామెల్, బ్రదర్ డేవిడ్ రాజు, మరియు బ్రదర్ స్టెపన్ భీమ్ భరత్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోపులారం ఉప సర్పంచ్ కుంటి భీమేశ్ యాదవ్, వార్డ్ సభ్యులు సురేందర్, సంఘస్తులు, కిష్టయ్య, దయానందు, శ్రీనివాస్, సంజీవ, లక్ష్మయ్య, జయంత్, రవి, కుమార్, జైపాల్, రమేష్, శ్రీకాంత్, శంకరయ్య, మహేష్, భాస్కర్, శ్రీధర్, దయాకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.