చిరంజీవి: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో జైలుకు వెళ్లొచ్చిన సినీ నటుడు అల్లు అర్జున్.. తన మామ, మెగాస్టార్ చిరంజీవిని ఆదివారం మధ్యాహ్నం కలిశారు. తన భార్యను తీసుకొని స్వయంగా కారును నడుపుకుంటూ అల్లు అర్జున్ మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. కేసు, అనంతర పరిణామాలపై వారిద్దరూ చర్చించుకున్నట్టు తెలిసింది. గత రెండు రోజుల నుంచే ఇరువురి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొని ఉన్నది. మెగా కుటుంబంతో ఉన్న వైరుధ్యంతో అల్లు అర్జున్‌ను కలుస్తారా? లేదా? అన్న విషయాలపై ఆసక్తి నెలకొని ఉన్నది.
అయితే ఆ అనుమానాలను పటాపంచెలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ.. ఇప్పటికే తన మేనల్లుడి ఇంటికి వెళ్లారు. అల్లుడు అర్జున్‌ను హత్తుకొని ఓదార్చారు. ఈ సందర్భంగా సురేఖ కొంత ఉద్వేగానికి గురయ్యారు. అల్లుడిని, పక్కనే ఉన్న తన సోదరుడు అల్లు అరవింద్‌ను చూసి ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఈ సమయంలో ముగ్గురి మధ్య భావోద్వేగం నెలకొన్నది.
అయితే అల్లుడి ఇంటికి చిరంజీవి స్వయంగా వెళ్తారని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా అల్లు అర్జున్ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి చిరంజీవితో గంట సేపు గడిపారు. అయితే అనంతరం ఇద్దరూ కలిసి మీడియా సమావేశం పెడతారని ఆశించారు. కానీ, మీడియాతో మాట్లాడకుండానే అల్లు అర్జున్ తన ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయనేది ఆసక్తికరంగా మారింది.
కేసు విషయమై అల్లు అర్జున్.. చిరంజీవికి చెప్పుకున్నారని, ఇదే సమయంలో లాయర్‌తోనూ మాట్లాడారని, కేసును ముందుకు వెళ్లకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలోనని చర్చించారని తెలిసింది. ఈ కేసులో మళ్లీ తీవ్రత రాకుండా చూద్దామని చిరంజీవి అల్లుడు బన్నీకి హామీ ఇచ్చినట్టు సమాచారం. పెద్దలతో మాట్లాడుతానని చెప్పారని కూడా వినికిడి. ఏదేమైనా కేసు విషయంలో అల్లుడికి సాయం చేసేందుకే చిరంజీవి నిర్ణయించుకున్నారని తెలిసింది.
Also read: 2024లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయి?