srivaris properties | శ్రీవారి ఆస్తుల వెల్లడి.. టన్నులకొద్ది బంగారం.. వేల కోట్ల విలువైన డిపాజిట్లు

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్తులను సంస్థ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా ప్రకటించారు. వివిధ రూపాల్లో ఉన్న స్వామి వారి ఆస్తుల( srivaris properties ) వివరాలను ఆయన వెల్లడించారు. కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలు, డిపాజిట్లు, స్థలాలను వివరించారు.

దేవస్థానానికి 960 స్థిర చరాస్తులు ఉండగా వాటి విలువ రూ.87,705 కోట్లు ఉన్నట్లు వెల్లడైంది. స్వామి వారి పేరుతో 7,123 ఎకరాల భూమి ఉన్నదని తేలింది. అదే విధంగా టీటీడీకి వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.14 వేల కోట్ల ఫిక్సుడ్ డిపాజిట్లు, 14 టన్నుల బంగారం ఉన్నట్లు ఆయన ప్రకటించారు.

ఇదిలా ఉండగా 1974 నుంచి 2014 మధ్య కాలంలో అప్పటి ట్రస్టు బోర్డులు స్వామి వారికి చెందిన 113 ఆస్తులను విక్రయించినట్లు వెల్లడించారు. 2014 నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ఆస్తులు విక్రయించలేదని చైర్మన్ తెలిపారు. టీటీడీకి ఉన్న ఆస్తులు, వాటి విలువలను వివరాలతో సహా టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో ఉంచినట్లు వెల్లడించారు.

Read More News  : Tirumala Thirupathi devasthanam