RRR Producer DVV Danayya.. ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్యకు అవమానం?  

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి: ఆర్ఆర్ఆర్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించిన నిర్మాత డీవీవీ దానయ్య ఆస్కార్, ఇతర అవార్డుల ఆనందాన్ని ఎందుకు ఆస్వాదించలేక పోయారు. రాజమౌళి అండ్ కో పట్టించుకోలేదా? దానయ్యే దూరమయ్యారా? మరేమైనా విభేదాలు పొడచూపయా? అనే అనుమానాలు కలుగకమానదు.   

పాన్ ఇండియా సినిమాగా సుమారు 600 కోట్లతో రూపుదిద్దుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత దానయ్య ఖర్చుకు వెనుకాడలేదు అని అందరూ తేల్చిచెప్పిన నిజం. అయితే సినిమా ప్రమోషన్స్ నుంచే రాజమౌళి, రాంచరణ్, ఎన్ఠీఆర్ మాత్రమే ఎక్సపోజ్ అయ్యారు తప్ప అప్పుడు కూడా నిర్మాత డీవీవీ దానయ్యను పట్టించుకోలేదని విమర్శ ఉంది. ఆ అనుమానం నాటు నాటు పాట అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డుల ప్రమోషన్స్ సమయంలో, అవార్డు ఫంక్షన్లలో దానయ్య ఆనవాళ్లు కూడా కానరాలేదు. రెండు మూడుసార్లు ప్రత్యేక ఫ్లయిట్లలో కుటుంబాల సమేతంగా అమెరికా వెళ్లిన బృందంలో నిర్మాత డీవీవీ దానయ్య లేకపోవడంపై సగటు ప్రేక్షకుడిలో కలిగిన అనుమానం మరింత బలపడింది.

దానయ్య దూరమయ్యాడా? దూరం పెట్టారా?

వందల కోట్లు ఖర్చు పెట్టి, సినిమాకు రూపుదెచ్చి, పాటలకు వెనుకాడని ఖర్చుతో ఫలితం కోసం ఎదురు చూసిన దానయ్య ఆశించిన ఫలితమే పొందాడు. కానీ ఎంతైనా ప్రపంచమే నివ్వెరపోయేలా ఆ సినిమాలోని పాటకు అవార్డుల వర్షం కురుస్తుంటే.. ఆ వర్షంలో దర్శక, నటులు, రాజమౌళి కుటుంబం తడిసి ముద్దవుతుంటే.. అదే పాటకు ఖర్చు పెట్టిన నిర్మాత మాత్రం దూరంగా ఉండటం ఏమైనా బాగుందా.. అని తెలుగు సినీ అభిమానులకు నిరాశ కలుగుతోంది.

అనుమానం అనంతం

త్రిబుల్ ఆర్ సినిమా క్రెడిట్ రాజమౌళికి దగ్గడంలో ఎటువంటి అభ్యంతరం ఎవరికీ లేదు. కానీ దానిలో కొంత శాతమైనా నిర్మాత దానయ్యకు ఎందుకు ఉండదని అనుకోవడంలోనూ తప్పులేదు కదా.

అనుకున్నదానికంటే ఖర్చు పెరిగింది: దానయ్య

ఇదిలా ఉంటే మరో ఆసక్తికర అంశం బయటకొచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా పాటకు ఆస్కార్ అవార్డు వచ్చాక నిర్మాత డీవీవీ దానయ్య చెప్పిన విషయాలు ఆలోచనలో పడేయకమానవు. కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎన్నో కష్టాలు పడ్డాం. అనుకున్నదానికంటే ఖర్చు పెరిగింది. నాటు నాటు పాట రిహార్సల్స్ 30 రోజులు సాగింది. ఉక్రెయిన్లో 17 రోజులు షూటింగ్ కొనసాగింది. ఈ ఒక్క పాట ఖర్చుకూ వెనుకాడలేదు. అంతటి కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఈ అవార్డు క్రెడిట్ అంతా రాజమౌళిదే.. ఆయన కష్టానికి ప్రతిఫలమే అవార్డుల పంట పండింది. అని వినయంగా నిష్కల్మషంగా చెప్పారు దానయ్య.

దానయ్య చెప్పిన చేదునిజం

ఆస్కార్ అవార్డు అందుకున్న అనంతరం అమెరికాలో ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమా టీం రాజమౌళి, ఇతర బృందం సభ్యులు ఆనందంలో మునిగి తేలినప్పుడు వారితో మాట్లాడేందుకు దానయ్య కాల్ చేశారట. కానీ ఆయన కాల్ కు రెస్పాండ్ రాలేదంట. అయితే ఫంక్షన్లో బిజీగా ఉండటం వల్లే వారు రెస్పాండ్ కాలేకపోయారని సర్దుకుపోయే మాట చెప్పారు దానయ్య. కానీ ఆయనను భాగం చేయకపోయినా పర్వాలేదు.. కానీ ఆనందాన్ని పంచుకునే సందర్భంలో విషెస్ చెప్పేందుకు ప్రయత్నించినా దానయ్యను పట్టించుకోకపోవడంపై అందరిలోనూ కొంత విస్మయం కలుగకమానదు.

సినిమా నిర్మాణ దశలో ప్రచారమైన వార్త?

ఆర్ఆర్ఆర్ సినిమాపై మరో విషయం ప్రచారంలో ఉంది. ఈ సినిమా నిర్మాణ దశలోనే నిర్మాత దానయ్యకు, దర్శకుడు రాజమౌళికి చెడిందనే ప్రచారం జరిగింది. దీంతో నిర్మాత వైదిలిగారో, తప్పించారో కానీ మధ్యలోనే నిష్క్రమించారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. మిగతా ఖర్చంతా రాజమౌళి, రాంచరణ్ భరించారని ఆనాడే గుసగుసలు పొక్కాయి. ఈ ఉద్దేశంతోనే దానయ్యను ఆర్ఆర్ఆర్ సినిమా టీం పక్కన పెట్టి ఉండొచ్చనే చర్చ జోరుగా సాగుతోంది. ఏది నిజం.. ఏది అసత్యమో కాలమే నిర్ణయించాలి.

 

 

<iframe width=”791″ height=”445″ src=”https://www.youtube.com/embed/F5raWSSDx4Y” title=”దానయ్య ను ఎందుకు పట్టించుకొలేదు?🧐అసలు కారణం ఏమిటో తెలుసుకోండి..#rrr #rrrmovie #rrroscar #telugunews” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share” allowfullscreen></iframe>