మానవ హక్కుల సంఘం రాష్ట్ర చైర్మన్ గా సాయికుమార్ గౌడ్

రచ్చబండ, శంకర్ పల్లి: ప్రపంచ మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లికి చెందిన జి.సాయికుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం ఆయన జాతీయ మానవ హక్కుల చైర్మన్ సుబ్బారెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ పుట్టుకతోనే సహజసిద్ధంగా మానవుడికి ఉండే హక్కులకై పోరాటానికి స్థాపించబడిన ప్రపంచ మానవ హక్కుల సంఘం తనకు అప్పగించిన ఈ బాధ్యతను మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని తెలిపారు. తనకు తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన జాతీయ చైర్ పర్సన్ గీతారెడ్డి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జంగారెడ్డి, సంధ్యారెడ్డికి, సంస్థ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.