రామోజీని కలిసిన రేవంత్

హైదరాబాద్‌ : టీపీసీసీ నూతన అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి మంగళవారం ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావును కలిశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రామోజీకి పుష్పగుచ్ఛం అందజేశారు. రేవంత్ కు రామోజీరావు శుభాకాంక్షలు తెలిపారు.