కేంద్ర ప్రభుత్వ నూతన మంత్రుల శాఖలు

కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం తన నూతన మంత్రి వర్గాన్ని బుధవారం (07-07-2021) నాడు పునర్వ్యవస్థీకరించింది. ఈ మంత్రి వర్గంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డికి సహాయ మంత్రిత్వ శాఖ నుంచి కేబినెట్ హోదాకు ప్రమోషన్ లభించింది. ఆయనకు పర్యాటక, సాంస్కృతిక శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖలు కేటాయించారు. ఆయా శాఖలు, మంత్రుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ – శాస్త్ర సాంకేతిక, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్షశాఖ, ముఖ్యమైన పాలసీలు, ఇతరులకు కేటాయించని మంత్రిత్వ శాఖలు

కేబినెట్‌ మంత్రులు – వారి శాఖలు

1. రాజ్‌నాథ్‌ సింగ్‌ – రక్షణ శాఖ

2. అమిత్‌ షా – హోంమంత్రిత్వ శాఖ, సహకార శాఖ
3. నితిన్‌ గడ్కరీ – రహదారులు, రవాణా శాఖ

4. నిర్మలా సీతారామన్‌ – ఆర్థిక శాఖ, కార్పొరేట్‌ వ్యవహరాలు
5. నరేంద్ర సింగ్‌ తోమర్‌ – వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ
6. సుబ్రహ్మణ్యం జయశంకర్‌ – విదేశీ వ్యవహారాలు
7. అర్జున్‌ ముండా –  గిరిజన వ్యవహారాలు
8. స్మృతి ఇరానీ- మహిళా, శిశుసంక్షేమశాఖ
9. పీయూష్‌ గోయల్‌ – వాణిజ్యం, పరిశ్రమలు, జౌళిశాఖ, ఆహార, ప్రజా పంపిణీ
10. ధర్మేంద్ర ప్రధాన్‌ – విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ, ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌
11. ప్రహ్లాద్‌ జోషీ – పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ
12. నారాయణ్‌ రాణే – చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
13. శర్వానంద సోనోవాల్‌ – ఓడరేవులు, జలరవాణా, ఆయుష్‌ శాఖ
14. ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ – మైనారిటీ వ్యవహారాలు
15. డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌ – సామాజిక న్యాయం, సాధికారత
16. గిరిరాజ్ సింగ్‌ – గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌
17. జ్యోతిరాదిత్య సింధియా – పౌర విమానయాన శాఖ
18. రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌ – ఉక్కు శాఖ
19. అశ్వినీ వైష్ణవ్‌ – రైల్వే, ఐటీ కమ్యూనికేషన్లు
20. పశుపతి కుమార్‌ పారస్‌ – ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ
21. గజేంద్రసింగ్ షెకావత్‌ – జల్‌శక్తి
22. కిరణ్‌ రిజిజు – న్యాయశాఖ
23. రాజ్‌కుమార్‌ సింగ్‌ – విద్యుత్‌, పునరుత్పాదక ఇంధన శాఖ
24. హర్‌దీప్‌ సింగ్‌ పూరీ – పట్టణ అభివృద్ధి, పెట్రోలియం శాఖ
25. మన్‌సుఖ్‌ మాండవీయ – ఆరోగ్యశాఖ, రసాయనాలు, ఎరువులు
26. భూపేంద్ర యాదవ్‌ – పర్యావరణ, అటవీ, ఉపాధి, కార్మిక శాఖ
27. మహేంద్రనాథ్‌ పాండే – భారీ పరిశ్రమల శాఖ
28. పురుషోత్తం రూపాల – డెయిరీ, మత్స్య శాఖ, పశుసంవర్థక శాఖ
29. కిషన్‌రెడ్డి – పర్యాటక, సాంస్కృతిక శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
30. అనురాగ్‌ఠాకూర్‌ – సమాచార-ప్రసారాలు,
యువజన వ్యవహారాలు, క్రీడలు

స్వతంత్ర హోదా- శాఖలు

1. రావు ఇందర్‌జిత్‌ సింగ్‌ – గణాంకాలు, ప్రణాళిక, కార్పొరేట్‌ వ్యవహరాలు
2. డా. జితేంద్ర సింగ్‌- శాస్త్ర సాంకేతికత, ఎర్త్ సైన్స్‌, ప్రధాని కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ

సహాయ మంత్రులు- వారి శాఖలు

1. శ్రీపాద యశోనాయక్‌ – ఓడ రేవులు, షిప్పింగ్‌, పర్యాటక శాఖ
2. ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే – ఉక్కు, గ్రామీణాభివృద్ధి
3. ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌- జల్‌శక్తి, ఆహార శుద్ధి
4. అశ్వినీ కుమార్‌ చౌబే – వినియోగదారుల వ్యవహరాలు, ఆహార, ప్రజాపంపిణీ, పర్యావరణం, అటవీ శాఖ
5. అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ – పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ
6. వీకే సింగ్‌ – రవాణా, రహదారులు, పౌరవిమానయానశాఖ
7. కృష్ణన్‌ పాల్‌ – విద్యుత్‌, భారీ పరిశ్రమలు
8. దన్వే రావుసాహెబ్‌ దాదారావు – రైల్వే, బొగ్గు, గనులు
9. రామ్‌దాస్‌ అథవాలే – సామాజిక న్యాయం, సాధికారత
10. సాధ్వీ నిరంజన్‌ జ్యోతి – వినియోగదారుల వ్యవహహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, గ్రామీణాభివృద్ధి
11. సంజీవ్‌ కుమార్‌ బాల్యన్‌ – మత్స్యశాఖ, పశుసంవర్థక, పాడిపరిశ్రమ
12. నిత్యానంద రాయ్‌ – హోం శాఖ
13. పంకజ్‌ చౌదరీ- ఆర్థిక శాఖ
14. అనుప్రియ సింగ్‌ పటేల్‌ – వాణిజ్య, పరిశ్రమల శాఖ
15. ఎస్పీ సింగ్‌ బఘేల్‌ – న్యాయశాఖ
16. రాజీవ్‌ చంద్రశేఖర్‌ – నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ
17. శోభా కరంద్లాజే – వ్యవసాయం, రైతు సంక్షేమం
18. భానుప్రతాప్‌ సింగ్‌ వర్మ- సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమల శాఖ
19. దర్శన విక్రమ్‌ జర్దోష్‌- రైల్వే, జౌళీ శాఖ
20. మురళీధరన్‌- విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
21. మీనాక్షి లేఖి- విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ
22. సోం పర్‌కాశ్‌ – వాణిజ్యం, పరిశ్రమల శాఖ
23. రేణుకా సింగ్‌ – గిరిజన వ్యవహారాలు
24. రామేశ్వర్‌ తేలి – పెట్రోలియం,నేచురల్‌ గ్యాస్‌, ఉపాధి, కార్మికశాఖ
25. కైలాస్‌ చౌదరీ – వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ
26. అన్నపూర్ణ దేవి – విద్యాశాఖ
27. నారాయణ స్వామి – సామజిక న్యాయం, సాధికారత
28. కౌశల్‌ కిశోర్‌ – గృహ, పట్టణ వ్యవహారాల శాఖ
29. అజయ్‌ భట్‌ – రక్షణ, పర్యాటకం
30. బీఎల్‌ వర్మ – ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకార శాఖ
31. అజయ్‌ కుమార్‌ – హోంశాఖ
32. దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌ – కమ్యూనికేషన్ల శాఖ
33. భగవంత్‌ ఖుబా – పునరుత్పాదక శక్తి, రసాయనాలు, ఎరువులు
34. కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్ – పంచాయతీ రాజ్‌
35. ప్రతిమా భౌమిక్‌ – సామాజిక న్యాయం, సాధికారత
36. సుభాశ్‌ సర్కార్‌- విద్యాశాఖ
37. భగవత్‌ కిషన్‌రావు కరడ్‌ – ఆర్థిక శాఖ
38. రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ – విదేశీ వ్యవహారాలు, విద్యాశాఖ
39. భారతీ ప్రవీణ్‌ పవార్‌ – ఆరోగ్యం, కుటంబ సంక్షేమం
40. బిశ్వేశ్వర్‌ తుడు – గిరిజన వ్యవహరాలు, జల్‌ శక్తి
41. శాంతను ఠాకూర్‌ – పోర్టులు, షిప్పింగ్‌, జలరవాణా
42. ముంజపర మహేంద్రభాయ్‌ – ఆయూష్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ
43. జాన్‌ బర్లా – మైనారిటీ వ్యవహారాలు
44. ఎల్‌. మురుగన్‌ – పాడి, పశుసంవర్థక, మత్య్స, సమాచార, ప్రసారశాఖ
45. నిషిత్‌ ప్రామాణిక్‌ – హోంశాఖ, యువజన, క్రీడా శాఖ