జాతీయ స్కేటింగ్‌ పోటీల్లో సత్తాచాటిన విశృత్‌

* అదరగొట్టిన హైదరాబాద్ బాలుడు
* జాతీయ స్కేటింగ్‌ పోటీల్లో సత్తా చాటిన విశృత్‌

* జాతీయ అండర్ -10 స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం
* రజత పథకం కైవసం చేసుకున్న క్రీడాకారుడు
* హర్యానా గురుగామ్ లో జరిగిన పోటీలు
* పలు రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీల్లో విశేష ప్రతిభ
* అంతర్జాతీయ పోటీలకు రెడీ

రచ్చబండ, హైదరాబాద్‌ : హర్యానా గురుగ్రామ్‌లో జనవరి 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి అండర్‌-10 రోలర్ స్కేటింగ్‌ పోటీల్లో తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి చెందిన శేరిపల్లి విశృత్‌ రజిత పతకం సాధించి సత్తా చాటాడు. నాగోలు బండ్లగూడకు చెందిన శేరిపల్లి ప్రసాద్, మాధవి దంపతుల కుమారుడు విశృత్‌ హైదరాబాద్‌ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో సీబీఎస్‌ఈలో నాలుగో తరగతి చదువుతున్నాడు. గురుగ్రామ్‌లో జరిగిన ఇంటర్‌ స్కూల్స్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ కాంపిటీషన్‌ 2022-2023లో విశృత్‌ తెలంగాణ నుంచి రోలర్ స్కేటింగ్ జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ చాటి ద్వితీయ స్థానం పొంది రజిత పతకం కైవసం చేసుకున్నాడు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా పాల్గొన్న క్రీడాకారుల్లో విశృత్‌ విశేష ప్రతిభ చాటాడు.

రెండుసార్లు జాతీయ పోటీల్లో ఆడిన బాలుడు
అదే విధంగా 2022-2023లో బెంగళూరు నగరంలో జరిగిన అండర్‌ 9-10 స్థాయి జాతీయ పోటీల్లో కూడా విశృత్‌ పాల్గొన్నాడు. తెలంగాణ నుంచి జాతీయ పోటీలకు ఎంపికైన ముగ్గురిలో ఒక క్రీడాకారుడిగా పాల్గొనడం విశేషం. అంతకు ముందు 2020-2021లో ఢిల్లీలో జరిగిన అండర్‌ 7-9 స్థాయి స్కేటింగ్‌ జాతీయ స్థాయి పోటీల్లో కూడా తెలంగాణ నుంచి పాల్గొన్న ముగ్గురిలో విశృత్‌ పాల్గొని ప్రతిభ చాటాడు.

రాష్ట్ర, జిల్లా స్థాయిలో పలు పతకాలు సొంతం
వివిధ జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీల్లో పాల్గొన్న విశృత్‌ 3 బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు. మరెన్నో వివిధ స్థాయిల్లో పతకాలు సొంతం చేసుకొని, ప్రశంసాపత్రాలు అందుకున్నాడు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఒక గోల్డ్‌, ఒక రజిత పతకం, మరెన్నో ప్రశంసాపత్రాలు పొందాడు.

చిరుప్రాయంలోనే విశేష ప్రతిభ
చిరుప్రాయంలోనే విశేష ప్రతిభ చాటుతున్న విశృత్‌ జాతీయ స్థాయి రజిత పతకం సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. స్థానికులు, బంధుమిత్రులతో పాటు స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది విశృత్‌ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. విశృత్‌ స్కేటింగ్ క్రీడలో మరింతగా ఎదిగేందుకు క్రీడాకారులు, క్రీడాభిమానులు, సహృదయులు సహకరించాలని వారంతా కోరుతున్నారు. త్వరలో జరిగే అంతర్జాతీయ పోటీలకు కూడా విశృత్‌ పాల్గొనాలనే కోరిక ఉంది. కానీ శిక్షణకు చాలా ఖర్చు అవుతుంది. త్వరలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సొంతం చేసుకొని మన దేశానికి, తెలంగాణకు పేరు, ప్రఖ్యాతులు తేవాలని విశృత్‌ తల్లిదండ్రులు, కోచ్, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు కోరుకుంటున్నారు.

ఇంటర్నేషనల్ టాప్ ప్లేయర్ ను అవుతా
త్వరలో జరిగే ఇంటర్నేషనల్ పోటీల్లో పార్టిసిపేట్ చేసేందుకు ప్రాక్టీస్ చేస్తా. తప్పక సెలెక్ట్ అవుతా. కచ్చితంగా ప్రైజ్ తెస్తా. అమ్మా, నాన్న నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. స్కూల్ లో కూడా ఎంకరేజ్ ఉంది. ఏనాటికైనా ఇంటర్నేషనల్ టాప్ స్కేటింగ్ ప్లేయర్ ను అవుతా.
– విశృత్‌, స్కేటింగ్ క్రీడాకారుడు, హైదరాబాద్ (9700630222)