మేడారం జాతర ఏర్పాట్ల గురించి తెలుసుకుందామా..!

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర తెలంగాణలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన జాతర. ఇక్కడికి రాష్ట్రంలోనే అత్యధిక మంది వచ్చే జాతర కూడా ఇదే. అటవీ ప్రాంతం గుండా సాగే ప్రయాణమైనా ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి లక్షలాది మంది భక్తజనం ఇక్కడికి తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ.

* మేడారం జాతర ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19 వరకు జరుగుతుంది.
* దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది.

* ఈసారి కూడా కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా.
* శుక్రవారం (11వ తేదీ) ఉదయమే ఆలయం పక్క నుంచి పారే జంపన్న వాగులోకి నీటిని విడుదల చేస్తారు.
* ఆర్టీసీ ద్వారా 3,850 బస్సులు నడిపి 21 లక్షల మంది ప్రయాణికులను చేరవేసేందుకు చర్యలు.

* మేడారంలో ఓ ప్రధాన ఆసుపత్రి ఏర్పాటుతోపాటు మరో 35 హెల్త్ క్యాంపుల ఏర్పాటు.
* 327 లొకేషన్లలో 6,700 టాయిలెట్ల నిర్మాణం.
* స్నాన ఘట్టాల ఏర్పాటు.
* జాతరలో తప్పిపోయిన పిల్లల కోసం ఆవరణలోని 18 ప్రాంతాల్లో క్యాంపుల ఏర్పాటు.

* శానిటేషన్ పర్యవేక్షణకై 19 జిల్లాల పంచాయతీ రాజ్ శాఖ అధికారుల నియామకం
* పంచాయతీరాజ్ శాఖ నుంచి 5,000 వేల మంది సిబ్బంది ఏర్పాటు
* జాతర విధుల్లో దాదాపు 9,000 పోలీసు అధికారుల నియామకం
* ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు