దివ్యవాణి కన్నీటి వెనుక కారణాలేంటి?

రచ్చబండ : సినీ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.  ఆ పార్టీ అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీలో తనకు తీరని అన్యాయం జరిగిందని, తీవ్ర అవమానాలు జరిగాయని దివ్యవాణి కన్నీంటి పర్యంతమయ్యారు.

దివ్యవాణి తనకు టీడీపీలో జరిగిన పలు విషయాలను గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తనకు జరిగిన అన్యాయంతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ గురించి ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ఆమె మాటలు ప్రత్యక్షంగా మీకోసం రచ్చబండలో..

  • ప్రజాసేవ కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చా. పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు. ఎవరి దగ్గరా డబ్బు ఆశించలేదు. నాఖర్చును నేనే భరించాను.
  • మత మార్పిడుల విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలు క్రైస్తవుల ఆగ్రహానికి గురయ్యాయి. క్రైస్తవులు పడే బాధలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లలేకపోయాను
  • ఏదైనా విషయంపై ప్రెస్ మీట్ పెట్టాలన్నా అనుమతి తీసుకోవాలి. ఒకరిని అడిగితే మరొకరి పేరు చెప్పారు. వారిని అడిగితే మరొకరి పేరు చెప్పారు. ఆయన్ను అడిగితే ఇంకొకరి పేరు చెప్పారు.
  • ఓసారి ప్రెస్ మీట్ పెట్టేందుకు టీడీపీ కార్యాలయానికి రెండో గేటు నుంచి వెళ్తుంటే నన్ను నిర్దాక్షిణ్యంగా నిలిపేశారు. నేను చెప్పాల్సిన విషయాలను నేను ఇచ్చిన సమాచారాన్నే వేరొకరితో చెప్పించారు.
  • టీడీపీలో నాకు చాలా సార్లు అవమానాలు జరిగాయి. నా సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తే.. జనార్దన్ కు చెప్పమన్నారు.
  • టీడీ జనార్దన్ అనే వ్యక్తిని నేను ప్రశ్నించినందుకే నన్ను అవమానిస్తూ వచ్చారు.
  • పార్టీలో నా పరిస్థితి ఏమిటో నాకే తెలియని పరిస్థితి నెలకొంది. నెమ్మదిగా నా డౌన్ ఫాల్ మొదలైంది. పొమ్మనలేక పొగబెట్టారు.
  • కొందరు ఇడియట్లు జర్నలిజం పేరుతో నానా మాటలు అన్నారు.
  • నేనేదో అన్నానని అన్నవాళ్లు అచ్చెన్నాయుడు పార్టీ లేదు.. బొక్కా లేదు.. అంటే ఏం శిక్షించారు.
  • సాధినేని యామిని లాగా నేనేమీ తీవ్ర విమర్శలు చేయలేదు.
  • నాలాగే ఇబ్బందులు పడేవాళ్లు టీడీపీలో చాలా మంది ఉన్నారు. వారికి పదవులు కావాలి కాబట్టి కుక్కల్లా అక్కడే ఉన్నారు.
  • నేను బాలకృష్ణ కంటే పెద్ద హీరోనే.. చంద్రబాబు సతీమణి గురించి కామెంట్లు వస్తే బాలకృష్ణ కంటే ముందే నేను స్పందించా.
  • మహానాడు నన్ను కూర్చోనివ్వలేదు. మాట్లాడనివ్వకుండా అవమానించారు. కొందరు దొంగల వల్ల అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.
  • చంద్రబాబు పర్సనల్ పీఏ రాజగోపాల్ నన్ను అవమానించారు. చంద్రబాబు ముందు ఒక మాట, నా ముందు ఒక మాట చెప్పారు.
  • చంద్రబాబుకు నా గోడు వెళ్లబోసుకుంటే అయ్.. వినమ్మా.. అయ్ వినమ్మా.. అంటూ కసురుకున్నారు. అయినా తండ్రిలాగా భావించినా.
  • నన్ను కుక్క పిల్లలా ఆడుకున్నారు. కరివేపాకుల వాడుకొని వదిలేస్తారని చెప్పినా నేను వినలేదు.
  • గౌరవం లేని చోట నేను ఉండలేదు. నా రాజీనామా లేఖను పార్టీకి పంపుతున్నా.