కొనసాగుతోన్న కృష్ణమ్మ పరవళ్లు.. నిండుతున్న తెలుగు జలాశయాలు

రచ్చబండ ప్రతినిధి : గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పైనున్న ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పెరిగాయి. దిగువన ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో జలసవ్వడి కొనసాగుతోంది.

శ్రీశైలం రిజర్వాయర్ కు 37,384 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దిగువకు 69,330 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు. ప్రస్తుతం 881.10 అడుగులకు చేరింది.

215.8070 టీఎంసీల నీటి నిల్వకు గాను, 193.8593 టీఎంసీలకు చేరింది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.

నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం ఆశాజనకంగానే కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 57,669 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 5,378 క్యూసెక్కలను దిగువకు వదులుతున్నారు.

సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 546.50 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, 202.1550 టీఎంసీల నీరు నిల్వ ఉంది.