16న భూమికి ప్రమాదం పొంచి ఉందా?

భూమికి పొంచి ఉన్న ముప్పుపై తరచూ భూగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ఎక్కడో ఓ చోట ఉత్పాతాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అవి ఎక్కడ జరుగుతాయే, ఎంత మేరకు జరుగుతుందో ముందే చెప్పలేకపోతుండటం గమనార్హం.

అంతరిక్షంలో ఓ భారీ గ్రహశకులం భూమికి అతి సమీపంలోకి వచ్చిందని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఆస్టరాయిడ్ 388945గా ఆ శకలాన్ని పిలుస్తున్నారు.

ఈనెల 16న అర్ధరాత్రి 2.48 గంటల సమయంలో భూమి సమీపంలోకి వస్తుందని తెలిపారు. ఆ గ్రహశకులం దాదాపు 1,608 అడుగుల వెడల్పు ఉంటుందని వెల్లడించారు.

అయితే ఆ గ్రహ శకులం ఎక్కడ పడుతుందో మాత్రం చెప్పలేకపోయారు. దీంతో దాని దిశను ముందుగానే గ్రహించి విచ్ఛిన్నం చేస్తారా.. లేక భూమికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా.. అని ప్రపంచమంతటా ఆందోళన నెలకొంది.