తెలంగాణ బిడ్డకు అంతర్జాతీయ గుర్తింపు

రచ్చబండ : తెలంగాణవాసికి అంతర్జాతీయ సంస్థలో అత్యున్నత పదవి దక్కింది. అంతర్జాతీయ విత్తనాభివృద్ది సంస్థ అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా నాగారం గ్రామానికి చెందిన డాక్టర్ కేశవులు నియమితులయ్యారు. స్విట్జర్ ల్యాండ్ కేంద్రంగా ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

ఐఎఫ్టీఏ చైర్మన్ గా ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా డాక్టర్ కేశవులు నియమితులు కావడం విశేషం. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీగా విధులు నిర్వహిస్తున్న కేశవులుకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం రావడంతో హర్షం వ్యక్తమవుతోంది.

ఈ మేరకు ఆయన హైదరాబాద్ లో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను ఘనంగా సత్కరించారు. ఐఎఫ్టీఏ నుంచి తెలంగాణ సహకారం అందించే విధంగా ముందుకు పోవాలని సూచించారు.