అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించకుంటే మంత్రులను అడ్డుకుంటాం

అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించకుంటే మంత్రులను అడ్డుకుంటాం

* సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్
రచ్చబండ, శంకర్ పల్లి: అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించకుంటే మంత్రులను అడ్డుకుంటామని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల కేంద్రంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించి, తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడారు.

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలనికోరారు. కనీస వేతనం 26,000గా ఇవ్వాలని కోరారు. జీవితంలో సగభాగం పెన్షన్ ఇవ్వాలని, రిటర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు, ఆయాలకు ఐదు లక్షలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో సమ్మె కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో సమ్మె ను మరింత ఉధృతంగా కొనసాగుతుందని అన్నారు.

అంగన్వాడి టీచర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు నరసింహ, అంగన్వాడీ జిల్లా కోశాధికారి లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు ఉమా స్వప్న, ప్రవీణ, అనిత, శంకర్ పల్లి మండలం నాయకురాలు ప్రేమ, మంగమ్మ కల్పన, రాధా, సుజాత, యాదమ్మ, పద్మారాణి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు